Jenious Cinema | విద్యావిధానం నేపథ్యంలో జీనియస్ చిత్రం
కొత్త సంవత్సరంలో తనకు నిర్ణయాలు అంటూ పెద్దగా ఏమీలేవని వర్ధమాన నటుడు హవీష్ అంటున్నారు. 'నువ్విలా' చిత్రం తర్వాత ఆయన నటిస్తోన్న చిత్రం 'జీనియస్'. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని జనవరి నుంచి అదే పనిలో ఉంటానని అదే కొత్త నిర్ణయమని వెల్లడించారు. శనివారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు.
నువ్విలా చిత్రం తర్వాత కంప్లీట్ అదే టైపు పాత్రలు ఎక్కువగా వచ్చాయి. అందుకుని గ్యాప్ ఇచ్చి సరైన కథ కోసం ఎదురుచూశాను. చిన్నికృష్ణ చెప్పిన కథ బాగా నచ్చింది. దర్శకుడు కొత్తయినా ఓంకార్ చెప్పిన విధానం... ఎట్రాక్ట్‌గా ఉంది అని చెప్పారు. ఏక్టింగ్ అంటే ఇష్టం. అది చేయడమే నా ముందున్న కర్తవ్యం. ఇలాగే ఉండాలి.. అలాగే ఉండాలని... రూల్స్ ఏమీ పెట్టుకోలేదు అన్నారు.
జీనియస్ చిత్రం గురించి చెబుతూ... తమిళ శంకర్ చిత్రాల తరహాలో ఉంటుంది. జెంటిల్‌మెన్ తరహాలో అండర్‌కరెంట్ సందేశం కూడా ఉంటుంది. అలా అని జెంటిల్‌మెన్ స్టోరీ టైప్‌కాదు. ఈ చిత్రంకోసం ఫిజిక్‌కూడా మార్చుకున్నాను. జీనియస్ సినిమా గెటప్ చూసి ఎంతోమంది అప్లాజ్ చేశారు. విజయవాడలోని నా స్నేహితులు, బంధువులు... చాలామంది ఈ గెటప్‌లో బాగున్నావని మెచ్చుకున్నారు. ఈ గెటప్ వచ్చాక ఇటువంటి తరహా పాత్రలు వస్తున్నాయి అని చెప్పారు.
దర్శకుడు కొత్తయినా చెప్పినట్లు తీయగలడనే నమ్మకముంది. నువ్విలా చేసేటప్పుడు నేను కొత్త. అప్పుడు దర్శకుడు ఏది చెప్పాడో అలా చేశాను. ఈసారి మాత్రం దర్శకుడు ఫుల్‌ఫ్లెజ్డ్‌గా అన్నీ తెలిసిన వ్యక్తి. నా పాత్ర వరకు చేయడం నేను చేయడమే అన్నారు. ఈ చిత్ర పాయింట్ విద్యావిధానం నేపథ్యంలో సాగుతుంది. మనదేశంలో ఎంతో మేథావులు, విద్యావేత్తలున్నా... ఎందుకని ఎదగలేకపోతుంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అనేది ఈ సినిమాలో చర్చించారు. ఈ చిత్రం 9వ తరగతి నుంచి యూనివర్శిటీ చదివే వారికి బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. ఈ చిత్రాన్ని కె.ఎల్. యూనివర్శిటీలో చేయాలనుకున్నా.... కొన్ని కారణాల వల్ల అక్కడ చేయడంలేదని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.