Gopichand | Latest Movie | గోపీచంద్ తాజా చిత్రం ప్రారంభం
WD
నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. మా హీరో గోపీచంద్ సరసన ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చి తీస్తున్నాం. మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తెలుగులో మొదట పూర్తి చేసి తర్వాత తమిళ నేటివిటీకి తగ్గట్లు ప్లాన్ చేస్తాం అని చెప్పారు.
గోపీచంద్ మాట్లాడుతూ, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫరెంట్ లవ్‌స్టోరీ మిక్స్ అయిన కథ ఇది. వినగానే బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఇందులో నా యాక్షన్ వవర్‌ఫుల్ హీరోయిజాన్ని చూపిస్తుంది. ఈ మూవీ నాకు డిఫినెట్‌గా వర్కవుట్ అవుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగులో నాకిది మొదటి సినిమా.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: తమన్, మాటలు: ఎం.రత్నం, కెమెరా: శక్తిశరవణన్, సమర్పణ: కొమర వెంకటేష్, కథ,స్క్రీన్‌ఫ్లే, దర్శకత్వం: జి. భూపతి పాండ్యన్.