1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tanish

Mem Vayasuku Vacham | Tanish | Madalasa Sharma | పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ''మేం వయసుకు వచ్చాం''

మేం వయసుకు వచ్చాం
లక్ష్మణ్‌ సినీ విజన్‌ సమర్పణలో, లక్కీ మీడియా పతాకంపై త్రినాధరావు నక్కినను దర్శకుడిగా పరిచయం చేస్తూ బెక్కెం వేణుగోపాల్‌-లక్ష్మణ్‌ కేదారి సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం 'మేము వయసుకు వచ్చాం'. బసిరెడ్డి(డిజిక్వెస్ట్‌)-గంటా నాగేశ్వర్రావు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. ఇటీవలే ప్రచార చిత్రాల (ట్రయిలర్స్‌) ఆవిష్కరణ జరుపుకుంది.

తనీష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నీతి టేలర్‌ హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, మదాలసశర్మ ('ఫిట్టింగ్‌ మాస్టర్‌' ఫేమ్‌) మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజా ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-లక్ష్మణ్‌ కేదారి మాట్లాడుతూ.. ''ప్రేమలోని ఒక కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న 'మేం వయసుకు వచ్చాం' అన్ని వయసులవారిని అలరిస్తుంది.

ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నీ ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే వారంలో ఆడియోను విడుదల చేసి, అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తనీష్‌ తన కెరీర్‌లో చాలా గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రంగా 'మేం వయసుకొచ్చాం' రూపుదిద్దుకుంటోంది. భాగ్యరాజా పోషిస్తున్న ప్రత్యేక పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది'' అన్నారు.

రమాప్రభ, సన, కాశీవిశ్వనాధ్‌, సూర్య, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, రక్ష ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: నివాస్‌, పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కూర్పు: పూడి ప్రవీణ్‌, నృత్యాలు: స్వర్ణ, కళ: వర్మ, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరిత మేడిశెట్టి, సహనిర్మాతలు: బసిరెడ్డి(డిజిక్వెస్ట్‌)-గంటా నాగేశ్వర్రావు, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-లక్ష్మణ్‌ కేదారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT