1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Aravind

Kamal Hasan | Aravind | Rushi Cinema | నాస్థానం అరవింద్‌ కొట్టేశాడు: కమల్ హాసన్ వ్యాఖ్య

కమల్ హాసన్
WD
30 సంవత్సరాల క్రితం నేను 'ఏక్‌ దూజేకేలియే' చిత్రాన్ని ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో చేశాను. ఇప్పుడు ఆ స్థానాన్ని అరవింద్‌ కృష్ణ కొట్టేశాడు.. అని కమల్‌హాసన్‌ అన్నారు. ఎల్‌వి.ప్రసాద్‌ తనయుడు ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత ఐమాక్స్‌ అధినేత అయిన రమేష్‌ప్రసాద్‌ చాన్నాళ్ళకు 'ఋషి' అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఆదివారం రాత్రి ఐమాక్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్‌హాసన్‌ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ, ప్రసాద్‌ సంస్థ ఇంత పేరుప్రఖ్యాతులు రావడానికి కారణం.. పంక్చువాలిటీ, సమయపాలన.. అన్నీ ఒన్‌మెన్‌ ఆర్మీలా చూసుకునేవారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన నిర్మించి ఋషి చిత్రం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

రమేష్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, 1981లో మా బేనర్‌లో నిర్మించిన చిత్రంలో కమల్‌ నటించారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌... ఇప్పుడు ఈ సినిమా కూడా మెడికోల నేపథ్యంలో సాగుతంది. ప్రతి ఒక్కరినీ కదలించే చిత్రమవుతుందని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT