Rebel February | Raghav Lawrence | Tamannah | ఫిబ్రవరి 15 నుండి ప్రభాస్, రాఘవ లారెన్స్‌ల ''రెబల్'' చివరి షెడ్యూల్
WD
ఈ చిత్రం గురించి నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ - ''ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్‌లో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 15 నుండి నాన్‌స్టాప్‌గా చిత్రం పూర్తయ్యే వరకు షూటింగ్ జరుగుతుంది. మే నెలాఖరులో ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం.
ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్‌లాంటి మంచి హీరోతో మా బ్యానర్‌లో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న కోఆపరేషన్‌ని ఎప్పటికీ మరచిపోలేము. అలాగే లారెన్స్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా కంపల్సరీగా సూపర్‌డూపర్ హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం నిర్మాతలుగా మాకు ఎంతో థ్రిల్‌గా వుంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. టైటిల్‌కి తగినట్లుగా చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రెబల్ రూపొందుతోంది. తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది'' అన్నారు.
దర్శకుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ - ''ప్రభాస్ పర్సనాలిటీకి, ప్రభాస్ ఇమేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సబ్జెక్ట్ 'రెబల్'. ఇది ప్రభాస్ తప్ప ఎవరూ చేయలేరు. 'రెబల్'లో ప్రభాస్ ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తున్నాడు. నిర్మాతలు భగవాన్, పుల్లారావుల మేకింగ్ సూపర్. అన్నివిధాలా 'రెబల్' చాలా మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న 'రెబల్'లో భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధమన్ ఎస్., ఫొటోగ్రఫి: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్' స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ- కొరియోగ్రఫి- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రాఘవ లారెన్స్