Lovely Cinema | Adi | Sanvi | ఇస్తాన్‌బుల్‌లో డేంజరస్ లొకేషన్స్‌లో ''లవ్‌లీ'' షూటింగ్
లవ్లీ రాక్‌స్టార్ ఆది, శాన్వి జంటగా నటకిరీటి డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'లవ్‌లీ' పాటల చిత్రీకరణ జనవరి 24 నుండి ఇస్తాన్‌బుల్, టర్కీలలో జరుగుతున్న విషయం తెలిసిందే.
కపడోషియా, ఆంటాల్యా, పాముక్కలే, కార్టెపె మౌంటైన్, ఆంత్రా సిటీలలో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని యూనిట్ ఇస్తాన్‌బుల్ చేరుకునే సరికి అక్కడ ఏర్పడిన భారీ మంచు తుఫాన్‌లో 'లవ్‌లీ' టీమ్ చిక్కుకుంది. గత 33 సంవత్సరాల్లో ఇస్తాన్‌బుల్‌లో ఎన్నడూలేని విధంగా భారీ మంచు తుఫాన్ రావడంతో ఇస్తాన్‌బుల్ అంతా అల్లకల్లోలమైపోయింది. ఈ తుఫాన్‌లో ఎంతో మంది చనిపోయారు. ఫ్లైట్స్ కూడా తిరగని పరిస్థితి ఏర్పడింది.
'లవ్‌లీ' యూనిట్ వ్యాన్స్‌పై కూడా పెద్ద పెద్ద మంచు చెరియలు విరిగిపడ్డాయి. ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో అక్కడి లోకల్ పర్సన్స్ అండ్ పోలీస్ సహకారంతో అంతా క్లియర్ చేసుకొని మంచు మయమై నిర్మానుష్యమైన ఇస్తాన్‌బుల్ సిటీలో ప్రాణాలకు తెగించి 'లవ్‌లీ' షూటింగ్‌ని చేశారు. మైనస్ 12 డిగ్రీస్ టెంపరేచర్‌లో సైతం యూనిట్ అంతా ఎంతో శ్రమించి ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దిగ్విజయంగా 'లవ్‌లీ' షూటింగ్‌ని అనుకున్న షెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు.
ఇస్తాన్‌బుల్‌లో చిత్రీకరిస్తున్న ఈ పాటలు 'లవ్‌లీ' సినిమాకి హైలైట్ అవుతాయి. ప్రముఖ డాన్స్‌మాస్టర్ బాబా భాస్కర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.అరుణ్‌కుమార్ సారధ్యంలో డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. ఇస్తాన్‌బుల్ షెడ్యూల్‌ని ఫిబ్రవరి 4 కల్లా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు.
'లవ్‌లీ రాక్‌స్టార్' ఆది, శాన్వి, నటకిరీటి డా|| రాజేంద్రప్రసాద్, 'వెన్నెల' కిషోర్, 'ఎల్‌బిడబ్ల్యూ' చిన్మయి, ఆంచల్, హర్షవర్థన్, సత్యకృష్ణన్, రాహుల్ దేవ్, డా|| పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి, వినయప్రసాద్, కాశీ విశ్వనాథ్, దువ్వాసి మోహన్, ప్రభాకర్, ధనరాజ్, ఏవీఎస్ శ్రీనివాస, నర్సింగ్‌యాదవ్, మాస్టర్ ప్రేమ్, బేబీ తనిష్క ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్ కో-ఆర్డినేషన్: శ్యామ్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, డాన్స్: సబీనా ఖాన్, ప్రేమ్‌రక్షిత్, బాబా భాస్కర్, సబీనా ఖాన్, పాటలు: అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, కందికొండ, సిరాశ్రీ, కాస్ట్యూమ్స్: నర్సింహరావు, మేకప్: రామకృష్ణ, స్టిల్స్: రాజా, విజువల్ ఎఫెక్ట్స్: ప్రైమ్ ఫోకస్, పబ్లిసిటీ డిజైన్స్: కిరణ్ పోస్టర్ యాడ్స్, ప్రొడక్షన్ కంట్రోలర్: రొంపల్లి మురళీకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జయ బి.