Facebook Cinema | తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ''ఫేస్‌బుక్''
సిద్దు ఫ్రం సికాకుళం, సీతారాముల కళ్యాణం లంకలో, సీమటపాకాయ్'వంటి హిచిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మదిలో ఎనలేని ముద్రను వేసుకున్న వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్ధ ఇప్పుడు తన నాల్గవ చిత్రంగా ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన మంచి సందేశాత్మక చిత్రంగా 'ఫేస్‌బుక్'ని నిర్మిస్తోంది. డా|| మళ్ల విజయప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించారు.
నిశ్చల, ఉదయ్, సూర్య, జెమిని సురేష్, అర్చనాశర్మ, నిషాశెట్టి, ప్రీతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకుంటోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మా చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలో మిగతా కారక్రమాలు పూర్తిచేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... సినిమా పూర్తయ్యింది. తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించాము. తమిళ్‌లో 'ముగ పుస్తగం'గా టైటిల్‌ను ఖరారు చేశాము. సినిమా ఇంత తొందరగా బాగా రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత మళ్ళ విజయప్రసాద్ గారే కారణం. ఏమి కావాలన్నా అన్నీ సకాలంలో అందించారు. ప్రస్థుత సమాజంలో ఫేస్‌బుక్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?..దానివల్ల లాభ నష్టాలు ఏంటి అని చర్చిస్తున్నాము.
ఈ సినిమా ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. నిర్మాత డా|| మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ... 'ఆర్పీ పట్నాయక్ ఈ కథ చెప్పినప్పుడు వెంటనే మనం చేస్తున్నాం అన్నాను. ఎందుకంటే ఈ చిత్రంలో మంచి సందేశం వుంది. మా సంస్థలో వచ్చిన అన్ని చిత్రాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన చిత్రాలే.
వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్ధ అంటేనే ప్రేక్షకులకు ఒక నమ్మకం. అందుకే వారి అభిరుచికి తగ్గట్టే భారీగా చిత్రాలు నిర్మిస్తూ సందేశం వుండేలా చూస్తాము. ఈరోజుల్లో యువతపై అత్యంత ప్రభావం చూపే సోషల్ నెట్‌వర్క్‌లో ముందుండే 'ఫేస్‌బుక్' ప్రధానాంశంగా చిత్రం తెరకెక్కింది. చిత్రాన్ని చాలా గోప్యంగా తెరకెక్కించాము. ఫేస్‌బుక్ ఏమిటి? ఇందులోని స్నేహాలు మంచివా చెడ్డవా, ఇవి ఎటువైపు దారితీస్తాయి, ఫేక్ ఐడిల వల్ల ప్రభావం ఎవరిపైన పడుతుందనే పలు ఆసక్తికర, వాస్తవ సంఘటనలు ఇందులో చూపించాము. ఆర్పీ పట్నాయక్ చాలా బాగా తెరకెక్కించారు. తెలుగుతో బాటు తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నాము. 'ముగ పుస్తగం'గా తమిళ్‌లో పేరు పెట్టాము. మార్చిలో సినిమాని విడుదల చేయనున్నాము'అన్నారు.మంచి దర్శకుడు కావాలి' అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ... 'ముందుగా నాకు నిర్మాత డా|| మళ్ళ విజయప్రసాద్ పరిచయం చేసిన రమణమూర్తికి, సూర్యారావుకి కృతజ్ఞతలు. కథ వినగానే ఒప్పుకున్న నిర్మాతకి కృతజ్ఞతలు. మే 10న మొదలైన స్క్రిప్ట్ జూన్ 27న షూటింగ్ స్టార్ట్ అయింది. 47 రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ చేశాము. అడిగిందల్లా సమకూర్చారు. ఆరు రాష్ట్రాల చుట్టూ కథ తిరుగుతుంది. 'ఫేస్‌బుక్' ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యాక ఐదారు రెట్లు ఫేస్‌బుక్ యూజర్స్ పెరుగుతారు. అసలు ఫేస్‌బుక్ వల్ల కష్టనష్టాలు తెలుస్తాయి' అన్నారు. చిత్రంలో నటించిన నటీనటులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నటీ నటులు: నిశ్చల్, ఉదయ్, సూర్య, జెమినిసురేష్, సురేష్(సీనియర్), రావు రమేష్,చలపతిరావు, భీమినేని శ్రీనివాసరావు, అర్చనా శర్మ (హీరోయిన్) నిషాశెట్టి, ప్రీతి
ఆర్ట్ : కృష్ణ,మాటలు:తిరుమల్, డిజిటల్ ఎడిటింగ్:ఆనంద్ వడిగి, కెమెరా:అబినందన్ రామానుజం, పి.ఆర్.ఓ: రాఘవేంద్రరెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: వల్లభనేని వినోద్, కథ- స్క్రీన్‌ప్లే- సంగీతం- దర్శకత్వం : ఆర్.పి.పట్నాయక్, నిర్మాత : డా||విజయప్రసాద్ మళ్ళ