Na Istam Cinema | Rana | Genelia | ఒక్క పాట మినహా రానా, జెనీలియాల ''నా ఇష్టం'' పూర్తి
WD
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుపుకుంటోందని రష్ చూసి మా యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నామని దర్శకుడ ప్రకాష్ తోలేటి ఆన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...మలేషియాలో 44 రోజులు, రామోజీ ఫిలింసిటీలో నెల రోజులు, రామానాయుడు సినీ విలేజ్‌లో వారం రోజులు చిత్రీకరించడం జరిగింది.
ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ లవ్‌స్టోరి ఇది. నా తొలి సినిమాకి హీరోగా రానా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను . ఇక పాటల విషయానికొస్తే చక్రి గారు అద్భుతమైన 7 పాటలనిచ్చారు. 2012 లోనే టాప్ పొజిషన్‌లో 'నా ఇష్టం' పాటలు నిలుస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. కునాల్ గంజ్వాల, అద్నాన్ సమి, మమతా శర్మ,కె.కె, షాన్ వంటి పాపులర్ సింగర్స్ ఆలపించారు. 4 పాటలను ప్రతి ఒక్కరూ హమ్ చేసుకుంటారు.
ఇందులోని ఐటం సాంగ్ మా గురువు గారు సుకుమార్ రేంజ్‌లో ఉంటుంది. హంసానందిని, మరియం జకారియా(100%లవ్ స్టోరి ఫేం), మునీరా ఈ సాంగ్‌లో నర్తించారు. ఇంకా జెనీలియా, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు,భరత్, నాజర్, సుబ్బరాజు, షావర్ ఆలీ హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మా అందరికీ పెద్ద విజయాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నాము'అన్నారు.
నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.... ఒక్క పాట మినహా చిత్రీ కరణ పూర్తయిన మా చిత్రం ఆడియోని అతి త్వరలో వినూత్న రీతిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. మార్చి ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయనున్నాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిర్మాతగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఒక అద్భుతమైన ఫీల్‌గుడ్ మూవీని మీ ముందుకు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
రానా, జెనీలియా, బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతిప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సినిమాటోగ్రఫి: వెంకట్‌ప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రచన: కోన వెంకట్, రచనా సహకారం: చంద్రశేఖర్ టి. రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, కో డైరెక్టర్స్ : మాధవ సాయి, తిరుమల కుమార్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: శ్రీకర్, శోభన్, ప్రసాద్, రామకృష్ణ, శ్రీధర్, శశిధర్, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.గోపాలకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: మోహన్ పరుచూరి, నాగు, ప్రొడక్షన్ మేనేజర్: మణికంఠ, పిఆర్‌ఓ: రాఘవేంద్రరెడ్డి. నిర్మాత: పరుచూరి కిరీటి, కథ-మాటలు - స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ప్రకాష్ తోలేటి