1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Samantha

Sidharth | Samantha | Nandini Reddy | నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్‌, సమంత

సిద్ధార్థ్
WD
'అలా మొదలైంది' దర్శకురాలు నందిరెడ్డి మలి చిత్రంలో సిద్దార్థ్‌, సమంతలు జంటగా నటిస్తున్నారు. శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, గణేష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశం గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. వెంకటేష్‌ క్లాప్‌ ఇవ్వగా, స్రవంతి రవికిషోర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత సురేష్‌ మాట్లాడుతూ... మంచి టీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మార్చి మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది అన్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ... అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందినిరెడ్డి లేడీ మణిరత్నం అనొచ్చని తెలిపారు.

నందినిరెడ్డి మాట్లాడుతూ, నా మొదటి సినిమాతో మంచి గుర్తింపు పొందాను. సిద్ధు, సమంతతో ఈ కథ మంచి పేరు తెస్తుంది. కుటుంబసమేతంగా చూడతగ్గ చిత్రమిదని అన్నారు.

సిద్దార్థ్‌ మాట్లాడుతూ... లేడీ డైరెక్టర్‌తో నా మొదటి సినిమా ఇది. ఆమె దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా కాంబినేషన్‌లో ఈ సినిమా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకముందని తెలిపారు. సమంత మాట్లాడుతూ, అలా మొదలైంది సినిమా చాలా సార్లు చూశాను. ఇలాంటి డైరెక్టర్‌తో పనిచేయాలని అనుకునేదాన్ని.

ఆ అవకాశం ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉంది. సిద్దార్థ్‌ అంటే నాకు చాలా గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. మల్టీడైమన్షన్‌ వాసు మాట్లాడుతూ, సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌, మా కాంబినేషన్‌లో 'కందిరీగ' లాంటి హిట్‌ చిత్రాన్ని తీశాం. వెంటనే నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌, సంగీతం: తమన్‌, కెమెరా: ఐ. ఆండ్రూస్‌.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT