1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Janaki

Film Singer | Janaki | Slipped | Bathroom | బాత్రూంలో జారిపడ్డ గాయని జానకి: తలకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

జానకి
FILE
ప్రముఖ నేపధ్య గాయనీమణి ఎస్.జానకి తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను హుటాహుటిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఆర్టీసీ బస్ స్టాండుకు సమీపంలో ఓ హోటల్‌లో బస చేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT