Renigunta Audio | Suresh Kondeti | ''రేణిగుంట'' చిత్రంలోని కంటెంట్ బ్రహ్మాండం: వి.వి.వినాయక్
WD
'రేణిగుంట' చిత్ర కథానాయుకుడు జానీ మాట్లాడుతూ 'రేణిగుంట' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కావటం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సురేష్ గారు ప్రొడ్యూసర్ కావడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాను గొప్పగా ప్రమోట్ చేస్తారు, కనుక తమిళంలా తెలుగులో ఘనవిజయం సాధిస్తుందని భావిస్తున్నాను'' అన్నారు.
చిత్ర దర్శకుడు పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ''ఏం మాట్లాడాలో తెలీటంలేదు. ఆనందంగా ఉంది. 'రేణిగుంట' చిత్రం నాకు మొదట చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగుకు సురేష్ కొండేటి గారు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు డి.రామానాయుడుగారు. నాకిష్టమైన దర్శకులు వినాయక్‌గారు రావటం చాలాచాలా సంతోషంగా ఉంది. 'రేణిగుంట' చిత్రం పక్కా కమర్షియల్ చిత్రం. సెంటిమెంట్, కామెడీ యాక్షన్ అన్నీ ఇందులో మిక్స్ చేయడం జరిగింది. 'జర్నీ' చిత్రంలా ఈ చిత్రం కూడా విజయాన్ని సాధిస్తుంది. ఈ సందర్భంలో సురేష్ కొండేటిగారికి తెలుగు 'రేణిగుంట' యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
సంగీత దర్శకుడు గణేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ ''తెలుగు పరిశ్రమకు చెందిన గొప్ప వాళ్లంతా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు. ఇది నా మొదటి చిత్రం. 'రేణిగుంట' వంటి ఓ మంచి చిత్రం ద్వారా తెలుగుకు అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. తమిళంలోలానే తెలుగులో కూడా 'రేణిగుంట' హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ''తమ్ముడు సురేష్ వరుసగా విజయాలను సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 'జర్నీ'లానే 'రేణిగుంట' కూడా హిట్ కావాలని కోరుకుంరటున్నాను'' అన్నారు. ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ ''గ్రాండ్ సక్సెస్ 'జర్నీ'. 'షాపింగ్‌మాల్' చిత్రం. ఇది కూడా హిట్ కావాలి. తప్పకుండా 'రేణిగుంట' పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.
చలనచిత్ర ప్రముఖులు కాజ సూర్యనారాయణ మాట్లాడుతూ ''సురేష్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. మేము ఫిలింనగర్ రోడ్‌నెంబర్ 9లో ఉంటాం. తను రాత్రి కనిపించడు, పగలుకనిపించడు. అంతగా కష్టపడతాడు. తను తిరుపతికి బయలుదేరి 'రేణిగుంట'కు వచ్చాడు. తిరుపతి చేరటంతో తన విజయ పరంపర హైట్స్‌ను చేరుతుంది'' అన్నారు.
అమర్ మాట్లాడుతూ 'రేణిగుంట' చిత్రం పెద్ద విజయాన్ని సాధించి మా పార్టనర్ అమర్‌కు బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు. గాయని కౌసల్య మాట్లాడుతూ ''సురేష్‌గారు ఒక పాట పాడలంటే వచ్చాను. 'జర్నీ' చిత్రాన్ని మ్యూజిక్ డైరక్టర్స్‌కు, గాయనీ గాయకులకు చూపించడం సురేష్‌గారి సంస్కారానికి నిదర్శనం'' అన్నారు.
మినిస్టర్ గంటా శ్రీనివాస్‌కు చిరు సత్కారం
ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావుకు వేదికపై నున్న ప్రముఖుల ద్వారా ఆత్మీయ సత్కారం జరిగింది. ఇందుకాయన కృతజ్ఞతలు తెలుపుతూ '''థ్యాంక్యూ సురేష్. ఈ సత్కారం నాకు సర్‌ప్రైజ్. ఈ 'రేణిగుంట' ఆడియో ఫంక్షన్‌కు వచ్చి పెద్దలు రామానాయుడుగారిని, వినాయక్ గారిని కలవటం సంతోషంగా ఉంది. సురేష్ త్వరలోనే మెగా పిక్చర్స్ చేయాలని, చేస్తాడని ఆశిస్తున్నాను'' అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ ''ఒక చిన్న సినిమాకు పెద్దసినిమాగా పెద్ద యొత్తున ప్రమోషన్ చేసి విజయాలను సాధించడం సురేష్ కొండేటికి అలవాటు. తన సిన్సియారిటీయే తనకు విజయాలను చేకూర్చిపెడుతోంది. ఈ సందర్భంలో సురేష్‌గారికి అభినందనలు'' అన్నారు.
అన్నయ్యకు మెనీ మెనీ థ్యాంక్స్
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అందర్నీ షార్ట్‌టైమ్‌లో పిలిచాను. 'ప్రేమిస్తే', 'జర్నీ' చిత్రాల్లో 'రేణిగుంట' చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుంది. ఇందులోని సబ్జెక్ట్ అటువంటిది. వాటి కంటే కూడా ఇది మంచి సినిమా జర్నీకంటే ముందు ఈ చిత్రం రిలీజ్ కావాలి. జర్నీ 50 రోజులు పూర్తి చేసుకుని వందరోజుల వైపుకు దూసుకువెల్తోంది. 'రేణిగుంట' చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. ఇందులో యుత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంది. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్‌ను ఇచ్చిన వినాయక్ అన్నయ్యకు థ్యాంక్స్'' అన్నారు.
'రేణిగుంట' పెద్ద సక్సెస్ కావాలి
ప్రముఖ దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ ''చాలా ఆనందంగా ఉంది. సురేష్, నేను ఒకేసారి జర్నీని ఆరంభించాం. తను నిర్మాతగా కూడా మారి 'ప్రేమిస్తే', 'జర్నీ' చిత్రాల ద్వారా విజయాలను సాధించాడు. స్ట్రయిట్ చిత్రాల్లా ప్రమోట్ చేస్తాడు. మంచి చిత్రాలను మన ప్రేక్షకులకు అందిస్తున్న సురేష్‌ను అభినందిస్తూ 'రేణిగుంట' చిత్రం సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సురేష్ ప్రమోషన్ ఫెంటాస్టిక్
చివరగా సుప్రసిద్ధ దర్శకులు వి.వి.వినాయక్ మాట్లాడుతూ ''సురేష్‌కొండేటిది ఉడుంపట్టు. పట్టుకుంటే వదలడు. అతను నా చేత వాయిస్ ఓవర్ చెప్పించిన విధానం. గదిలో పెట్టి లాక్ చేసినట్టే. అయితే 'రేణిగుంట' చిత్రంలోని కంటెంట్ బ్రహ్మాండం. డైరెక్టర్ ఎంతో బాగా దానిని చెప్పాడు. 'ప్రేమిస్తే' చూసి మనం ఎంత బాగుంది అనకున్నాం. ఈ చిత్రం కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని ప్రతీపాత్ర చాలా ఒరిజినల్‌గా ఉంటుంది.
ఆర్టిస్టులు ఆ పాత్ర కోసమే ఉన్నారా అనిపిస్తుంది. మనవూళ్లో, మన వీధీలో ఉన్నట్టు పాత్రలు జరిగినట్టు సన్నివేశాలు ఉంటాయి. ఫాదర్ చనిపోయిన సీన్ నాకయితే పెయిన్ కలిగించింది. సురేష్ తన చిత్రాలకిచ్చే ప్రమోషన్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఎస్.కె.పిక్చర్స్ బ్యానరులో వచ్చే చిత్రం ఎంతో బాగుంటుంది అన్న నమ్మకాన్ని కలిగించాడు సురేష్.
ఈ సందర్భంలో గంటా శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం ఆనందంగా ఉంది. సురేష్‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను'' అన్నారు. అనంతరం వి.వి.వివినాయక్ గంటా శ్రీనివాసరావు ఆడియోను విడుదల చేయగా మొదటి సీడీని డా||డి.రామానాయుడు అందుకున్నారు