Malligadu | Karthi | Priyamani | Rajamouli | తెలుగుస్టార్స్‌కు పోటీగా తమిళ హీరోలు : రాజమౌళి
WD
మార్చి 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... నాకు తమిళ మార్కెట్ లేదు. నేను తీసిన విక్రమార్కుడు తమిళంలో కార్తీ చేసి.. నా మార్కెట్‌ను పెంచాడని అభినందించారు.
తమిళంలో మీరు చేయాలి: కార్తీ
తమిళంలో మీరు సినిమా చేయాలని కార్తీ రాజమౌళిని అడిగారు. ఇంకా కార్తీ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా తెలుగువారికి చూపించలేకపోయాననే లోటువుండేది అది తీరిందన్నారు.
సినిమాలు చాలా వస్తుంటాయి, పోతుంటాయి.. ప్రేమాభిషేకం, మరోచరిత్ర వంటివి అప్పుడప్పుడు వస్తాయి. అలాంటి సినిమా మల్లిగాడు. నా మొదటి సినిమాను అమీర్ దర్శకుడు అద్భుతంగా చేశాడు.
ఈ సినిమాతో ప్రియమణి నేషనల్ అవార్డు పొందిందన్నారు. గ్రామాల్లో ఉండే స్వచ్చమైన అల్లరి, ప్రేమ ఇందులో ఉన్నాయి. తెలుగువారికి మల్లిగాడు సినిమా నచ్చుతుందని కార్తి ఆశాభావం వ్యక్తం చేశాడు.