1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Rachcha | Audio | ram Charan | Tamanna | Chiranjeevi | ఈనెల 11న రామ్ చరణ్ "రచ్చ" ఆడియో విడుదల

రచ్చ
WD
WD
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను అందించిన మెగా సూపర్‌‍గుడ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్ర "రచ్చ". ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. దీనికి ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్‌లు సహ నిర్మాతలు. ఒక విశిష్టమైన కథతో అన్ని తరగతుల ప్రేక్షకుల్ని ఆలరించే అంశాలతో హీరో రామ్ చరణ్‌ను ఓ కొత్త కోణంలో సూపర్‌గుడ్ సంస్థ చూపించబోతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ చక్కని స్వరాలతో గీతాలను స్వరపరచగా చంద్రబోస్, సుద్ధాల అశోకతేజలు పాటలను రాశారు.

ఈ చిత్రం ఆడియో విడుదల వివరాలను చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ వివరిస్తూ.. రామ్ చరణ్ హీరోగా నిర్మించిన చిత్రం "రచ్చ" ఆడియోను చలన చిత్ర ప్రముఖుల సక్షమంలో మార్చి 11వ తేదీన హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇక మా 'రచ్చ'ని సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని చెప్పారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాజర్, దేవ్‌గిల్, ముఖేష్ రుషి, పార్తీబన్, అజ్మల్, బ్రహ్మానందం, ఆలీ, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్య, ఎమ్మెస్ నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, రఘుబాబు, కృష్ణభగవాన్, రవిబాబు, ఉత్తేజ్, గీత, ప్రగతి తదితరులు నటిస్తున్నట్టు వివరించారు.

ఈ చిత్రానికి మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు చంద్రబోస్, సుద్దాల అశోక తేజ, సంగీతం, మణిశర్మ, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కళ ఆనంద్ సాయి, ఎడిటింగ్ గౌతం రాజు, కో డైరక్టర్ రావిపాటి రాంబాబు, నృత్యదర్శకులు రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, శోభి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ భీమినేని రాయుడు, సహకార దర్శకులు నవీన్, మురళి, గిరి, ప్రొడక్షన్ మేనేజర్స్ నారాయణ, బాలరాజు పని చేస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు.
About Writer
PNR