1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. బాబోయ్.. నాకు రాజకీయాలు వద్దేవద్దు..: నాగార్జున

Nagarjuna, Politics, Kalyan Jewellers | బాబోయ్.. నాకు రాజకీయాలు వద్దేవద్దు..: నాగార్జున

నాగార్జున
WD
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మరోసారి రాజకీయాల్లో ప్రవేశించేది లేదని గట్టిగా చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వననీ, ప్రస్తుతం చాలా హ్యాపీగా హాయిగా ఉన్నానని అన్నారు.

నెల్లూరులో కల్యాణి జ్యుయలరీ షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగార్జునకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చాలా ఏళ్ల తర్వాత నెల్లూరుకు రావడం సంతోషంగా ఉన్నదని నాగార్జున అన్నారు.

ఇక శిరిడి సాయిబాబా చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రం కోసం అందరం ఎంతో కష్టపడి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయదశమి నాటికి చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT