1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kajal Agarwal

Mahesh Babu | Kajal Agarwal | Sukumar | ఏప్రిల్‌ 23 నుంచి మహేష్‌, సుకుమార్‌ల చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌

మహేష్ బాబు
WD
సూపర్‌స్టార్‌ మహేష్‌తో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'దూకుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ చిత్రాన్ని నిర్మించిన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఆర్య, ఆర్య2, 100% లవ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ అయింది. 'బిజినెస్‌మేన్‌' వంటి బ్లాక్‌బస్టర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన హీరోయిన్‌గా నటించిన కాజల్‌ మహేష్‌తో నటిస్తున్న రెండో చిత్రమిది. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలని నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌ ప్లాన్‌ చేస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT