1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Racha

Summer Special Movies | Racha | Dammu | Gabbar Singh | Adhinayakudu | సమ్మర్ స్పెషల్ మూవీ ఏది.. రచ్చ...? దమ్ము..? గబ్బర్ సింగ్..? అధినాయకుడు..?

సమ్మర్ స్పెషల్ చిత్రాలు
WD
వేసవిలో టాలీవుడ్ వెండితెరను షేక్ చేసేందుకు మెగా కుటుంబం నుంచి రెండు.. నందమూరి కుటుంబం నుంచి మరో రెండు చిత్రాలు వస్తున్నాయి. సహజంగానే పంచ్ డైలాగులతో అదరగొట్టే నందమూరి హీరోల సినిమాలు ఒకవైపు విడుదలకు సిద్ధమవుతుంటే.. ఎంతో భారీ అంచనాతో గురువారంనాడు రామ్ చరణ్ తేజ రచ్చ విడుదల కాబోతోంది.

రచ్చలో 'వానా వానా...' పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ చిత్రంలోని పాటలు వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. ఇక రామ్ చరణ్ మగధీర తర్వాత హిట్ కోసం మొహం వాచిపోయి ఎదురుచూస్తున్నాడు. ఇందుకోసం రచ్చలో ఎన్ని దెబ్బలు తగిలినా వాటన్నిటినీ ఓర్చుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నాడు.

రామ్ చరణ్ సరసన పాలకోవా లాంటి తమన్నా అందాలను ట్రెయిలర్లో చూసి కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. ఇక బిగ్ స్క్రీన్‌పై రామ్ చరణ్‌తో వానలో తడుస్తూ స్టెప్పులేసేటపుడు చూస్తే ఏమేరకు చిత్తవుతారో చూడాలి. మొత్తమ్మీద వేసవి రేసులో ముందుగా విడుదలవుతున్న రచ్చ స్టామినా మిగిలిన మూడు చిత్రాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
WD

జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి హై వోల్టేజి పాత్రలో చూపించినట్లు సింహా డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ముదురు భామ త్రిష, టీనేజ్ గాళ్ కార్తీక నటిస్తున్నారు. సింహాద్రిలా కత్తులే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని మూవీ ట్రెయిలర్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ దమ్ము మిగిలిన చిత్రాలను వెనక్కి నెడుతుందో లేదంటే వీటికంటే వెనకబడిపోతుందో చూడాలి

WD

మెగా ఫ్యామిలీ నుంచి ఈ సమ్మర్ లో వస్తున్న మరో చిత్రం గబ్బర్ సింగ్. ఇది హిందీలో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ సాధించింది. సల్మాన్ ఖాన్ హీరోగా సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా వచ్చిన దబాంగ్ బాక్సాఫీసు వద్ద రూపాయలను కురుపించింది. అదే కథను పవన్ కల్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అంటూ తెరకెక్కించారు. నటనలో ఈజ్ కనబరిచే పవన్ కు ఇది పవర్‌ఫుల్ సినిమా అవుతుందంటున్నారు. మరి వేసవి చిత్రాల్లో గబ్బర్ సింగే నెంబర్ 1 అవుతాడా..?
WD

ఆఖరుగా అధినాయకుడు. ఈ చిత్రంలో బాలకృష్ణ మొత్తం మూడు షేడ్లు ఉన్న పాత్రలను పోషించాడు. పెద్ద బాలకృష్ణ పాత్రలో నటించిన బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ హావభావాలను పలికిస్తూ ఉన్నట్లు ట్రెయిలర్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మరొక విషయమేమిటంటే.. అధినాయకుడు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిపై సెటైర్లు వేసే పంచ్ డైలాగులున్నాయని అంటున్నారు. మరి ఈ పంచ్ డైలాగులు పేలి పై మూడు చిత్రాలను పక్కకు నెడతాయా.. అనేది చూడాల్సి ఉంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT