1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Palakollu

Rachcha Film | Palakollu | Tamanna | Chiranjeevi | ram Charan | ప్రపంచ వ్యాప్తంగా రచ్చ చేస్తున్న చెర్రీ : పాలకొల్లులో వీరంగం!!

రచ్చ చిత్రం
File
FILE
మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన "రచ్చ" చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం సుమారు రెండు వేల థియేటర్లలో విడుదలైనట్టు సమాచారం. ఈ సందర్భంగా మెగా అభిమానులు అన్ని థియేటర్ల వద్ద రచ్చరచ్చ చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చెర్రీ అభిమానులు విర్రవీగి పోయారు. స్థానిక ధాత్రి థియేటర్ అద్దాలను అభిమానులు ధ్వంసం చేశారు. పట్టణంలోని ధాత్రి థియేటర్‌లో "రచ్చ" సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమా రీల్స్ సకాలంలో రాకపోవడంతో ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులకు ఆగ్రహంతో రగలిపోయి.. థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన ఆందోళనకారులను చెదరొగట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

'చిరుత', 'మగధీర' వంటి బంపర్ హిట్‌ల తర్వాత వచ్చిన 'ఆరెంజ్' చిత్రం పూర్తిగా నిరాశపరించింది. దీంతో 'రచ్చ'పై అభిమానులు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు అభిమానుల నోళ్ళలో బాగానే నానుతున్నాయి. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని హీరోయిన్ పాలబుగ్గల చిన్నది తమన్నా తన అందాలను పూర్తిగా ఆరబోసినట్టు సమాచారం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి