1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio Release

Gabbar Singh | Audio Release | April 15 | Pavan Kalyan | ఏప్రిల్‌ 15న సరికొత్త స్టైల్‌లో ''గబ్బర్‌సింగ్‌'' ఆడియో

గబ్బర్ సింగ్
WD
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హరీష్‌ శంకర్‌ ఎస్‌. దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్‌సింగ్‌' ఆడియో ఏప్రిల్‌ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ - ''గబ్బర్‌సింగ్‌' ఆడియో ఏప్రిల్‌ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఏప్రిల్‌ 15 ఉదయం పవన్‌కళ్యాణ్‌గారు స్పెషల్‌ ఫ్లైట్‌లో తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అభిమానుల్ని కలుసుకుంటారు. తర్వాత వైజాగ్‌, సింహాచలం వెళ్ళి దైవదర్శనం చేసుకొని అక్కడ కూడా అభిమానుల్ని కలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్‌గా జరిగే 'గబ్బర్‌సింగ్‌' ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటారు'' అన్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన శృతి హాసన్‌, మలైకా అరోరా, అభిమన్యు సింగ్‌, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అజయ్‌, నాగినీడు, రావు రమేష్‌, గిరి, ఫిష్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్‌, మాస్టర్‌ ఆకాష్‌, మాస్టర్‌ నాగన్‌, ప్రవీణ్‌, మర్ల శ్రీను, కాశీభట్ల,

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్‌, డాన్స్‌: దినేష్‌, గణేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: డి.బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT