1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Gabbar Singh

Chiranjeevi | Gabbar Singh | Pavan Kalyan | Mega Family | కోట్లకు పడగలెత్తినా మీ అభిమానం ముందు దిగదుడుపే: చిరంజీవి

చిరంజీవి
WD
WD
ఈ సమాజంలో కోట్లాది రూపాయలకు పడగలెత్తినా.. తమ పట్ల, తమ కుటుంబం పట్ల అభిమానులు చూపిస్తున్న అభిమాన ధనాన్ని సంపాదించలేరని మెగాస్టార్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'గబ్బర్ సింగ్‌' ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి.. అభిమానులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

35 సంవత్సరాల క్రితం సినిమాలో నటించాలన్న ఆలోచన తనకు రాకుంటే.. ఒక జన్మ వ్యర్థం చేసుకుని ఉండేవాడినని, అలాగే మా కుటుంబం కూడా ఓ జన్మను వేస్ట్ చేసుకుని ఉండేదన్నారు. ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఎంత గొప్పవారైనా సరే ఈరకమైన అభిమాన ధనం సంపాదించడం అనేది పూర్వజన్మ సుకృతమేనన్నారు.

మమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు మమ్మల్ని ఇంతవారిని చేశాయన్నారు. అందుకే మీ పట్ల మాకు నిలువెల్లా కృతజ్ఞతాభావం ఉంటుందన్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని నిరంతరం ఆలోచన చేస్తుంటామన్నారు.

ఇంతమంది ప్రేమను పొందడం, మీ గుండెల్లో స్థానం సంపాదించడం సర్వసాధారణమైన విషయం కాదన్నారు. ఇది ఎన్నో జన్మల పుణ్యం. అలాంటి పుణ్యాన్ని కలిగిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు, అభిమానులకు మా మెగా కుటుంబం ఎన్నటికీ రుణపడి ఉంటుందని చిరంజీవి చెప్పారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి