1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Linguswami

Tamannah | Linguswami | Love | Premalo Padite Audio | లింగుస్వామిపై నా కెంతో ప్రేమ... తమన్నా

తమన్నా
WD
ఎస్‌కె పిక్చర్స్‌ బ్యానరుపై అందిస్తున్న తాజా చిత్రం 'ప్రేమలో పడితే'. ఈ చిత్రం మే 4వ తేదీన రిలీజ్‌ అవుతున్న సందర్భంగా ఈ చిత్రం ఆడియో వేడుకను హైద్రాబాద్‌ హోటల్‌ తాజ్‌ బంజారాలో వైభవంగా జరిపారు సురేష్‌ కొండేటి.

ఈ కార్యక్రమానికి చెన్నై నుండి సుప్రసిద్ధ దర్శకుడు, 'ప్రేమలోపడితే' తమిళ నిర్మాత లింగుస్వామి, దర్శకుడు బాలాజీ శక్తివేల్‌, హీరోలు ప్రసన్నమిథున్‌, శ్రీ మరియు ముఖ్యఅతిథిగా తమన్నా, దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్‌, టెలీ సీరియల్‌ స్టార్‌ సాగర్‌, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, నటుడు - నిర్మాత నాగబాబు, చంద్రబోస్‌, తదితరులు హాజరయ్యారు. వీరందరికి ఎస్‌కె పిక్చర్స్‌ సురేష్‌ కొండేటి సాదర స్వాగతం పలికారు. ముందుగా చిత్ర తమిళ నిర్మాత లింగుస్వామి ట్రైలర్స్‌ను ఆవిష్కరించారు

ముఖ్య అతిథులలో ఒకరైన తమన్నా మాట్లాడుతూ 'నేడిక్కడ నేనిలా నిలబడటానికి కారణం బాలాజీ శక్తివేల్‌‌గారు, లింగుస్వామిగారు, బాలాజీగారు ఎక్కడో నా ఫోటో చూసి నన్ను ఆడిషన్స్‌కు పిలిచారు. ఆయన సింపుల్‌ డైరెక్టర్‌ కాదు. చాలా హానెస్ట్‌ అండ్‌ సిన్సియర్ డైరెక్టర్‌. లింగుస్వామిగారు నా సినిమాకు సంబంధించి అన్నీ నేర్పించారు. కొంచెం కూడా కాంప్రమైజ్‌ కాని వ్యక్తి లింగుస్వామిగారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

డైరెక్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాగర్‌ మాట్లాడుతూ- 'ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడక తప్పదు. నన్ను ఎంతోమంది ప్రేమించారు. నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి హిందీ అగ్రనటి రేఖ సోదరి విమల. ప్రేమ అనేది చాలా డర్టీ. అందులో పడితే సగం జీవితం క్లోజ్‌....
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT