Nagarjuna | King | Cinema | Dasarath | కామాక్షి మూవీస్ చిత్రంలో ''కింగ్'' నాగార్జున
WD
WDఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ... ''ఈ రోజు ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి జరుగుతుంది. ఈ చిత్రం కోసం యు.ఎస్.లో 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. నాగార్జున ఇమేజ్‌కి తగ్గట్టు డైరెక్టర్ దశరథ్ ఈ సబ్జెక్ట్‌ని అద్భుతంగా రూపొందించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లోగానీ, జనవరిలోగాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ... ''అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్‌ఆర్‌ఐగా ఫస్ట్‌టైమ్ ఇండియా వస్తారు. అతను ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని అనుభవాలతో ఈ కథ రూపొందించడం జరిగింది. శివప్రసాద్‌రెడ్డిగారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఈ బేనర్‌లో సినిమా చెయ్యాలన్న కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్ళకు అది నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది.
నాగార్జునగారు చేసిన 'సంతోషం', 'మన్మథుడు' తరహాలో ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. 'సంతోషం' తర్వాత నాగార్జున గారితో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నన్ను దర్శకుడ్ని చేసిన నాగార్జునగారంటే నాకు ఎప్పటికీ కృతజ్ఞత వుంటుంది. ఈ సినిమాలో నాగార్జునగారు చాలా కొత్తగా వుంటారు. అలాగే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది'' అన్నారు.
కింగ్ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : అనిల్ భండారి, సంగీతం : థమన్ ఎస్.ఎస్, ఆర్ట్ : ఎస్.రవీందర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్ : కె.సదాశివరావు, స్క్రీన్‌ప్లే : హరికృష్ణ, అడిషనల్ స్క్రీన్‌ప్లే : ఎం.ఎస్.ఆర్., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్, కో-ప్రొడ్యూసర్ : డి.విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం : దశరథ్.