Gabbar Singh | Shruti Hasan | Kamal Hasan | "గబ్బర్ సింగ్" శ్రుతిహాసన్ తండ్రి కమల్ హాసన్ కామెంట్
ఫ్లాపులతో నెగెటివ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్ గబ్బర్‌సింగ్‌తో హిట్ హీరోయిన్‌గా మారిపోయింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ చిత్రం కావడంతో వారు బాగా తీశారనీ, అందులో నేను నటించడం గర్వంగా ఉందని చెప్పింది. మంగళవారం రాత్రి మీడియా ముందుకు వచ్చింది.
హిట్ టాక్‌తో మీరెలా ఫీలవుతున్నారు అని అడిగితే.... చాలా ఆనందంగా ఉంది. మొదట నన్ను తీసుకునేటప్పుడు చాలామంది ఐరన్‌లెగ్ అని అన్నారని దర్శకులే చెప్పారు. నేనూ విన్నాను. ఇప్పుడు షడన్‌గా గబ్బర్‌సింగ్ హిట్టుతో గోల్డెన్ లెగ్ అంటున్నారు. పరిస్థితులను బట్టి మాట్లాడేవారి గురించి నేను పట్టించుకోను అంది.
కానీ, ఇక్కడో విషయం చెప్పాలి. గబ్బర్‌సింగ్ సినిమా చేస్తున్నాను. అనగానే పాజిటివ్ రియాక్షన్స్ కొన్ని కన్పించాయి. ఇది హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. అలాగే అనుకున్నట్లు జరిగింది. దీనికి ప్రధానకారకుడు పవన్‌కళ్యాణే. ఆయన చాలా గ్లామర్‌గా కన్పించడంతోపాటు... ఒన్‌మాన్ షోగా సినిమా మోసారు.
