1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tamannah

Rebel Cinema | Tamannah | Darling | Deeksha Seth | అందరికీ అతను డార్లింగ్‌ - నాకు మాత్రం తమన్నా...

రెబల్ సినిమా
WD
"ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువని విన్నాను. సినిమా షూటింగ్‌లో కూడా చాలా జెంటిల్‌గా ఉంటాడు. చాలా హైట్‌" అంటూ నటి దీక్షాసేథ్‌ ప్రభాస్‌ గురించి చెప్పింది. 'రెబల్‌' సినిమాలో ఆమె నటించింది. ఆమెతోపాటు తమన్నా కూడా నటించింది. సెకండాఫ్‌లో దీక్షా పాత్ర వస్తుంది. ఇద్దరు హీరోయిన్లు కలుసుకోరట. దర్శకుడు రాఘవ లారెన్స్‌ అద్భుతంగా తెరకెక్కించాడట సినిమాను.

తమన్నా మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు '100%లవ్‌'లో పెర్‌ఫార్మెన్స్‌ పాత్ర చేశాను. డాన్స్‌ పరంగా పెద్దగా చేయలేదు. రెబల్‌లో లారెన్స్‌ మాస్టర్‌ నాచేత డాన్స్‌ చేయించారు. ఆయన నా గురువు. అద్భుతంగా వచ్చింది" అంది.

దీక్షాసేథ్‌ మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరోయిన్‌ తమన్నా. చాలా క్యూట్‌గా తెల్లగా ఉంటుంది. డాలింగ్‌ అంటూ అప్పుడప్పుడూ పిలుస్తా"నంటూ వ్యాఖ్యానించింది. రెబల్‌ సినిమా టీజర్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలైంది.

ఈ నెల 25న ఆడియోను విడుదల చేస్తామని త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు జె.పుల్లారావు, దానయ్య తెలిపారు. ఈ చిత్రంలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్‌ శంకర్‌, విశాల్‌, ఆకాష్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న 'రెబల్‌' చిత్రానికి మాటలు: డార్లింగ్‌ స్వామి, ఫోటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్‌: బుజ్జి, కిరణ్‌, నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్‌.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి