Shirdi sai Cinema | Chiranjeevi | Nagarjuna | Tollywood | "శిరిడి సాయి"తో నాగార్జున జన్మ ధన్యమైంది: చిరంజీవి
WD
శిరిడి సాయి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రసాద్ ల్యాబ్‌లో చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్.... చాలా ఎమోషన్ ఫీలయ్యాను. శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు.
అన్నమయ్య, శ్రీరామదాసు...ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పుడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లకు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు గారు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్ రెడ్డి సాయి తత్వాన్ని అందరి తెలియచేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు.
విజయ యాత్ర.. శిరిడి సాయి చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకాభిమానులను కలుసుకునేందుకు శిరిడి సాయి చిత్ర యూనిట్ విజయ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వైజాగ్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. శిరిడి సాయి విజయ యాత్రలో నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.