విరాట్ కోహ్లీపై మనసు పారేసుకున్న అంజలి... భర్త కోసం కండీషన్స్!?
FILE
ఈ మధ్య నీకెలాంటి భర్త కావాలని అంజలిని మీడియా వారు ప్రశ్నిస్తే తనకు విరాట్ కోహ్లిలా మంచి హుషారుగా ఉండాలని, కోహ్లిలో ఉండే చురుకుదనం, అందంగా, స్లిమ్‌గా అన్నీ కలగలిపినవాడై ఉండాలని తన మనసులో మాట చెప్పేసింది అంజలి.
అంతేకాదు తనకు కాబోయే వాడికోసం స్ట్రిట్ రూల్స్ పెట్టింది అంజలి. నాకు నున్నగా షేవ్ చేసుకున్నవారికంటే, ట్రిమ్ చేసుకున్న వారేనే ఎక్కువుగా ఇష్టపడతానని చెప్పింది. అంతేకాదు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని ఇలాంటి లక్షణాలున్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఇప్పటి వరకూ నాకు నచ్చిన వ్యక్తి దొరకలేదు ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే ఠక్కున ఓకె చెబుతానని అంజలి అంటోంది. మరి అంజిలికీ విరాట్ లాంటి వాడు దొరుకుతాడంటారా?