1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

100 ఏళ్ల ఇండియన్ సినిమా... ఎస్వీఆర్, అల్లు రామలింగయ్యల స్టాంప్స్

టాలీవుడ్
FILE
భారత చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న మే3వ తేదీన గుర్తుగా ఎస్వీ రంగారావు, భానుమతి, అల్లు రామలింగయ్యల స్టాంపులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సినిమా రంగంలో సేవలు అందించిన పలువురి పేరుతో స్టాంప్‌లను విడుదల చేసింది. ఈ విషయాన్ని సోమవారంనాడు హైదరాబాద్‌లోని ఛాంబర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్‌ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ సి. కళ్యాన్‌ తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ... 100 సంవత్సరాలు మే 3న పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలుగులో మూడు స్టాంపులను విడుదల చేసింది.

1. ఎస్‌.వి.రంగారావు
2. అల్లు రామలింగయ్య
3. భానుమతి.

ఇంకా మరికొన్ని పేర్లు ప్రతిపాదనకు పంపాము. అందులో సాలూరు రాజేశ్వరరావు, రఘుపతి వెంకయ్యలు ఉన్నారని చెప్పారు. పై స్టాంప్‌లను వారి కుటుంబసభ్యుల సమక్షంలో జూన్‌లో హైదరాబాద్‌లో ఫంక్షన్‌ నిర్వహించి వెలువరిస్తామని అన్నారు. అదేవిదంగా దక్షిణాది తరపును మొత్తం 14 మందికి రికమండేసన్‌ చేస్తే.. దానికిగాను 9 మందిని కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.

తమిళంలో- నగేష్‌, కన్నదాసన్‌, సి.వి. శ్రీధర్‌లకు దక్కాయని, కన్నడలో విష్ణువర్ధన్‌, మలయాలంలో ప్రేమకుమార్‌కు దక్కాయని పేర్కొన్నారు. అనంతరం అల్లు అరవింద్‌ మాట్లాడుతూ... 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉండి అనేక గౌరవాలు సంపాదించి పరమపదించిన ఏడేళ్ళ తర్వాత అల్లు రామలింగయ్యగారిని కేంద్రప్రభుత్వం గుర్తించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ... తమ కుటుంబాన్ని అభిలాంధ్ర ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇంకా ఛాంబర్‌ అద్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ అద్యక్షుడు బూరుగుపల్లి శివరమాకృష్ణ, మురళీమోహన్‌ తదితరులు మాట్లాడుతూ.... తెలుగులో మూడు స్టాంప్‌లు విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని, కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

100 రోజుల పండుగను జులై 12,13,14 తేదీల్లో చెన్నైలో నిర్వహిస్తామని, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీప్రముకులు హారజుకానున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వారు సమాధానమిస్తూ... సినిమా పితామహుడు రఘుపతి వెంయ్య పేరుపై స్టాంప్‌ను ప్రతిపాదించామనీ, జులై లోపు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి