ఛార్మి : పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దు... ఊపిరి పీల్చుకున్న దేవిశ్రీ
FILE
మంత్ర సినిమాలో మహా మహా.. అంటూ 'లవ్ చేయకుంటే తప్పు' అంటూ వచ్చిన పాటలో డ్యాన్సు చేసిన ఛార్మి నిజంగానే లవ్ చేయకుంటే తప్పన్నట్లు వ్యవహరిస్తుంది. అందుకు తనకు పెద్దలు కుదిర్చిన వివాహాలపై నమ్మకం లేదని.. తన ప్రవర్తనకు అది సరిపడదని తేల్చి చెప్పింది. ''పెద్దలు చూసిన సంబంధం అంటే.. ఎలాంటి అబ్బాయి వస్తాడో, ఎలా చూసుకొంటాడో అనే ఆందోళన ఉంటుంది. నా అభిప్రాయాలూ, సినీ రంగంలో ఉండే సమస్యలు, నా పరిస్థితులు ఇవేమీ అర్థం కాకపోవచ్చు. అప్పుడు సమస్యలు వస్తాయి కదా?' అని అంటోంది ఛార్మి.
అంటే సినీ రంగంలో ఉన్న వ్యక్తి అయితే తనకు సరిగ్గా సరిపోతాడని ఇన్‌డైరెక్ట్‌గా దేవిశ్రీని టార్గెట్ చేస్తూ మాట్లాడిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయం తెల్సిన దేవిశ్రీ ఆనందంతో పొంగిపోతున్నాడట. గత కొంత కాలంగా దేవిశ్రీ, ఛార్మీలు ప్రేమాయణం కొనసాగిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్న సంగతి అందరికీ తెల్సిందే.