రామ్ చరణ్‌తో చిరంజీవికి తలనొప్పి... చెర్రీ వీరంగంపై చర్చ...?!!
WD
కేంద్రంలో పర్యాటక శాఖామంత్రిగా పదవి చేపట్టి అహర్నిశలు పొలిటికల్ కెరీర్లో ముందుకు సాగాలని చూస్తున్న చిరుకు రామ్ చరణ్ తేజ చేష్టలు స్పీడు బ్రేకర్లుగా మారుతున్నాయన్న వాదనలు వినబడుతున్నాయి. కేంద్రంలో పలువురు కేంద్రమంత్రుల పదవులు తమ సంతానం చేష్టల కారణంగా పోగొట్టుకోవలసిన సందర్భాలు తెలిసిందే.
ఈ నేపధ్యంలో చిరంజీవి పుత్రరత్నం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఆవేశానికి కొద్దిగా కట్టలు వేసుకుంటే మంచిదని శ్రేయోభిలాషులు చెపుతున్నారు. మరి చెర్రీ తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటాడో లేదో చూడాలి.