బాలకృష్ణ, బోయపాటి కొత్త సినిమా డైలాగ్స్ లీక్... చిరుపై పంచ్ డైలాగ్స్!
Publish: Wed, 19 Jun 2013 (15:56 IST)
Updated: Wed, 19 Jun 2013 (15:56 IST)
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఈ చిత్రం 2014 ఎన్నికలనే టార్గెట్ గా బాలయ్య చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొన్ని పంచ్ డైలాగులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రింది డైలాగులు చూస్తే తెలుస్తుంది...విలన్ ఇలా అంటాడు... నేను ఎవరో నాదే పార్టీయో నా రేంజ్ ఏంటో తెలుసా...?బాలయ్య డైలాగ్... నువ్వు పెట్టింది ఒక పార్టీ. ఉంటుంది మరో పార్టీ. సీబీఐ పేరు చెబితే వణికిపోతావు, అదీ నీ రేంజ్. నేను ఏ పార్టీనో నా రేంజ్ ఏంటో అదిగో వాళ్లను అడుగు( ప్రేక్షకుల వైపు చూపిస్తూ). చరిత్ర సృష్టించిన పార్టీరా నాది. రికార్డ్స్ బ్రేక్ చేసిన రక్తంరా నాది. ఇలాంటి పంచ్ డైలాగులు చాలానే ఉన్నాయంటున్నారు. మొత్తమ్మీద 2014 ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని జనంపైకి వదిలేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
మరింత చదవండి