ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకైనా రెడీ : సిమ్రాన్ గ్రీన్ సిగ్నల్
FILE
తన నటనతోనూ, గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిని ఈ భామకు పెళ్లయ్యాక కష్టాలు మొదలయ్యాయి. గ్లామర్ తగ్గడం.. కొత్త హీరోయిన్ల రాకతో సిమ్రాన్ క్రమక్రమంగా తెరమరుగైపోయింది.
పెళ్లయ్యాక సిమ్రాన్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. తద్వారా తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలు చేసేందుకు సిమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో.. అదన్నమాట.. టైమ్ అంటే..!