చీకటి రహస్యాలతో ''కొత్తొక వింత''
WD
ఈ సందర్భంగా దర్శకుడు బి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ - ''విదేశీ కల్చర్ మోజులో పడి, పెడదారి పడుతున్న యువత గొప్పదైన మన సంస్కృతిని విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో సహజసిద్ధంగా చూపిస్తూ అందర్నీ విస్మయపరిచే యూత్ కల్చర్‌లోని, చీకటి రహస్యాలను స్పృశించడం జరిగింది. నటీనటులు చక్కని పెర్‌ఫార్మెన్స్ కనబరిచారు.
ఎమ్మెస్ నారాయణ పాత్ర ఈ చిత్రానికి ఓ హైలైట్. ఎస్.ఎస్.ఆత్రేయ మంచి సంగీతాన్ని అందించారు. పి.ఎస్.ప్రకాష్ ఫొటోగ్రఫీ చిత్రానికి ఓ ఎస్సెట్. కమర్షియల్ విలువలతో కూడుకున్న యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. మోడ్రన్ ట్రెండ్ ఫిల్మ్. వినోదంతో పాటు యువతకి చక్కటి సందేశాన్నిచ్చే చిత్రం. ఇప్పటి ట్రెండ్‌కి అనుగుణంగా నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్ చేసి జులై నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు.