రామ్గోపాల్ వర్మ ''సైకో''పై సమావేశం... పిలిచినా పట్టించుకోని వైనం
WD
అది ఆయన పొగరుబోతుతనానికి నిదర్శనమని కొందరు విమర్శిస్తుంటారు. అమితాబ్‌తో సినిమా చేస్తే... దాన్ని కవర్ చేయడానికి మీడియా లైవ్ కెమెరాలతో షూట్ చేసేవారు. తర్వాత్తర్వాత.. అది తగ్గిపోయింది. ప్రస్తుతం వర్మ 'సైకో' సినిమా రూపొందించాడు. ఆ చిత్రం ప్రమోషన్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చాడు. ప్రశ్నలు వేయమని అడిగితే ఎవ్వరూ స్పందించలేదు. ఎప్పుడూ ఆయనతో బాగా దగ్గరగా ఉండే కొంతమంది కూడా వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఉత్సాహంలో ఉన్న కొత్త జర్నలిస్టులు ఇద్దరు మాత్రమే ప్రశ్నలు వేశారు. దాంతో ఆయన వెనుదిరిగారు. ఈ పరిణామాన్ని ఆయన ఆశ్చర్యపడకపోయినా.... అక్కడ నిర్వాహకుల్ని పిలిచి.. ఏంటీ.. మీడియా.. స్పందించడంలేదని అడిగారు.
మీరు ఏం చెబుతారో తెలుసునని.. చాలామంది అడగలేదని అనడం జరిగింది. అయితే బుధవారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తే... ముగ్గురు మినహా ఎవ్వరూ హాజరు కాకపోవడం విశేషం.