ఎవడులో అల్లు అర్జున్ చనిపోతాడా?
FILE
ఎవడు సినిమాను 'ఫేస్ ఆఫ్' అనే ఆంగ్ల సినిమాను ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్నారని సినీవర్గాలు అనుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ పాత్రధారి చనిపోతాడు. మరి ఎవడులో కూడా అల్లు అర్జున్ చేసిన పాత్ర చనిపోతుందా అనే వార్తపై మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
నిజానికి 'ఠాగూర్' తమిళ వెర్షన్‌లో హీరో విజయకాంత్ చనిపోతాడు. కాని మన తెలుగు ఫ్యాన్స్ ఒప్పుకోరని ఠాగూర్‌లో చిరంజీవి పాత్ర చనిపోకుండా స్క్రిప్ట్ మార్చారు. మరి ఇప్పుడు నిజంగానే ఎవడు సినిమాలో అల్లు అర్జున్ చనిపోతే మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి?