కేజ్రీవాల్ గెటప్పులో ఎమ్మెస్ నారాయణ!
PR
యువతను విశేషంగా ఆకట్టుకున్న ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌ను ఈసారి ఈ నటుడు అనుకరించబోతున్నాడు. 'క్రేజీవాలా' అనే పేరుతో రూపొందిస్తోన్న సినిమాలో ఎమ్మెస్ టైటిల్ రోల్ చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా వుంటుందని దర్శకుడు మోహన్ ప్రసాద్ తెలిపాడు. ఇది పూర్తి రాజకీయ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగు సోమవారం హైదరాబాదులో ప్రారంభమయింది.