1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సుశాంత్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

సుశాంత్
WD
కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన యూత్‌హీరో సుశాంత్‌ బర్త్‌డే మార్చి 18. ఈ సందర్భంగా సుశాంత్‌ నటించే కొత్త చిత్రం వివరాలు ప్రకటించారు. సుశాంత్‌ కథానాయకుడుగా రీసెంట్‌గా దైనికైనా రెడి వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ అందించిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర అధినేత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ చిత్రం గురించి హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ''నా బర్త్‌డేకి ఈ న్యూస్‌ని ఓ స్పెషల్‌ గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఇంతవరకు శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ బేనర్‌లోనే సినిమాలు చేసిన నేను బయటి బేనర్‌లో చెయ్యాలంటే ఓ పెద్ద బేనర్‌లో చెయ్యాలని వెయిట్‌ చేశాను. నేను వెయిట్‌ చేసినట్టుగానే అత్తారింటికి దారేది వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తీసిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బేనర్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

అలాగే నాగేశ్వరరెడ్డిగారితో వర్క్‌ చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారు, నాగేశ్వరరెడ్డిగార్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌కి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''ఇది ఒక యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. సుశాంత్‌ ఇప్పటివరకు లవ్‌ సినిమాలు చేశాడు. ఫస్ట్‌టైమ్‌ సుశాంత్‌లో వున్న ఆల్‌ యాంగిల్స్‌ని ప్రజెంట్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసిన సబ్జెక్ట్‌ ఇది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్‌లో చేస్తున్న సినిమా ఇది. నాగేశ్వరరెడ్డితో సినిమా చేద్దామని చాలాకాలంగా అనుకుంటున్నాం. ఆయన చెప్పిన కథ సుశాంత్‌కి చాలా పర్‌ఫెక్ట్‌గా వుంటుందనిపించింది. కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాలతో చాలా మంచి పేరు సుశాంత్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఏప్రిల్‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి'' అన్నారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి