1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సునీల్ ''భక్త కన్నప్ప'': భక్తుడు కాదు ప్రేమికుడు!

టాలీవుడ్
FILE
'భీమవరం బుల్లోడు' సునీల్‌తో ప్రముఖ నటుడు, దర్శకుడు భరణి 'భక్త కన్నప్ప' అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ యాక్షన్, కామెడీ సినిమాలలో నటించే సునీల్ భక్తుడి పాత్రకు సరిపోతాడా అని అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమాలో తన పాత్రఎలావుంటుందో అన్నదానిపై సునీల్ వివరణ ఇచ్చాడు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటించిన భక్తకన్నప్పలో మాదిరిగా ఇందులో నా పాత్ర వుండదు. ఈ టైటిల్‌ను చూసి అందరూ నాది భక్తుడిపాత్ర అని అనుకుంటున్నారు. కానీ ఇది ఓ గిరిజన ప్రేమకథా చిత్రమని సునీల్ వెల్లడించాడు. గ్రామీణ ప్రాంతంలో అందంగా సాగిపోయే ప్రేమకథా చిత్రమైన ఇందులో కావాల్సినంత వినోదం కూడా వుంటుందని, అభిమానులు ఏమాత్రం నిరాశచెందొద్దని సునీల్ చెప్పాడు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి