1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గోపీచంద్ కొత్త సినిమా స్టార్ట్ ... మరో ''రణం''!

గోపీచంద్
FILE
టాలీవుడ్ హీరో గోపీచంద్ తన రూటును మార్చుకున్నాడు. వరుసగా యాక్షన్ సినిమాల్లో నటించి హిట్టుకు దూరమైన గోపీ మరలా తన పాత రూటునే ఎంచుకున్నాడు. రణం, లక్ష్యం, శౌర్యం వంటి సినిమాలతో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన గోపీచంద్ ఇటీవల నటించిన సినిమాల్లో వినోదం తగ్గిందని భావించాడో ఏమోగాని తాజాగా మరో వినోదాత్మక చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు.

భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీ తాజాగా ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో ఆయన సరసన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ప్రస్తుతం గోపీచంద్ "జగన్మోహన్ ఐపీఎస్" సినిమాలో నటిస్తున్నాడు. రణం సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఇందులో వినోదం ఉంటుందని గోపీ చెబుతున్నాడు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి