1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

స్క్రిఫ్ట్ లేకుండా సంగీతం నావల్లకాదు: ప్రీతమ్

ధూమ్ అఖండ విజయానికి కారకుడైన ప్రీతమ్ పాత్ర చిత్రీకరణ
ధూమ్, ధూమ్- 2 ఆడియోల అఖండ విజయానికి కారకుడైన ప్రీతమ్ స్క్రిప్ట్, పాత్రచిత్రీకరణ చూడకుండా సంగీతం అందించడం తన వల్ల కాదంటున్నాడు. తాను సంగీతం అందించేప్పుడు ముందు చిత్రాలకు సంబంధం లేకుండా ఉండేందుకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రీతమ్ తెలిపాడు. ధూమ్, ధూమ్- 2 ఆడియోలు బాలీవుడ్‌లో బిగ్‌హిట్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే.

తాను సంగీతం అందించే చిత్రం ఎదైనా పూర్తిగా కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటానని, అందువలన కొన్ని సార్లు సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు ప్రీతమ్ తెలిపాడు. తనకున్న బలహీనత కూడా ఇదేనని ప్రీతమ్ అన్నాడు. ప్రేక్షకులు తన చిత్రాలను గుర్తించలేకపోతున్నారని అన్నారు. వెరైటీ కోసం ప్రయత్నిస్తే సమస్యలెలా వస్తున్నాయనే ప్రశ్నకు ప్రీతమ్ సమాధానమిస్తూ తాను సంగీతం అందించిన చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకోలేకపోతున్నారని అన్నాడు.