గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » మేఘనా మార్క్ ఐటెం సాంగ్
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
మేఘన నాయుడు... ఈ పేరు వినగానే 'కలియోంకా చమన్' పాట గుర్తుకువస్తుంది.ఈ పాట ద్వారా కుర్రాకారుని ఉర్రూతలూగించింది విజయవాడకు చెందిన ఈ ముద్దుగుమ్మ. 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' చిత్రంలో మరోసారి తన ఐటెం సాంగ్‌తో టీనేజ్ హృదయాలలో గిలిగింతలు రేపింది. అంతకుముందు బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఈ సెక్సీతార పూర్తిస్దాయిలో పేరుతేచ్చుకోలేకపోయింది.

ఆ తర్వాత ఎంతో ఆశగా టాలీవుడ్‌లో పాదం మోపి ఇక్కడకూడా చుక్కెదురు అవ్వటంతో ముంబై చెక్కేసింది. ఏదేమైనా ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఈ సుందరాంగి ఇటు తెలుగు అటు తమిళ భాషా చిత్రాలలో తళుక్కుమంటోంది. 'మరొక్కసారి అదృష్టం అవకాశం రూపంలో తలుపుతట్టడంతో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రంలో నటించే అవకాశం వచ్చింద'ని మహా సంబంరంగా చెపుతోందీ ముద్దుగుమ్మ.

ఇకనుంచి దక్షిణాదిన నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని చెబుతున్న మేఘన తన డాన్స్ గురించి ప్రత్యకంగా చెప్పేది ఏమీ లేదనీ, అది ప్రేక్షకులకు తెలిసిన విషయమేనని అంటోంది.