1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"''బాయ్స్‌" హీరోలతో జెనీలియా ప్రేమ పాఠాలు?

జెనీలియా బాయ్స్ చిత్రం హీరోయిన్ చిత్ర హీరోలు ప్రేమ
'బాయ్స్‌' సినిమాలో నటించిన హీరోయినజెనీలియా ఈ చిత్ర హీరోలతో ప్రేమలో పడినట్టు పుకార్లు వస్తున్నాయి. ఆ సినిమా చిత్రం ఆరంభంలో పెళ్లయిన సిద్ధార్థతో జెనీలియా ప్రేమలో పడ్డట్టు వదంతులు వచ్చాయి. జెనీలియా కోసం ఒక దశలో తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధార్థ సిద్ధపడ్డట్టు వినికిడి. ఇది గతం విషయం.

అయితే తాజాగా జెనీలియా 'బాయ్స్‌' సినిమాలో మరో హీరో అయిన భరత్‌తో ప్రేమలో పడ్డట్టు చెన్నయ్‌ కోడంబాక్కం వర్గాలు కోళ్లై కూస్తున్నాయి. అయితే అటు సిద్ధార్థ, ఇటు భరత్‌ కూడా తనకు కేవలం బాయ్ ఫ్రెండ్స్‌ అంటోంది జెనీలియా. అయినా.. సిద్ధార్థ ఫ్యామిలీమెన్ అయితే... భరత్ మాత్రం బ్యాచిలన్న విషయం మరువరాదు.