1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

బెంగాలీ కుర్రాడిపై సమీరా ప్రేమ!

పురుడుపోసుకుంది.. తెలుగు గడ్డపై. పెరిగింది మాత్రం పూర్తిగా ముంబై హిందీ వాతావరణంలో. కళా ప్రపంచానికి అతీతమైన పలు భాషల
పురుడుపోసుకుంది.. తెలుగు గడ్డపై. పెరిగింది మాత్రం పూర్తిగా ముంబై హిందీ వాతావరణంలో. కళా ప్రపంచానికి అతీతమైన పలు భాషల సినిమాలలో చేస్తోంది తెలుగింటి ముద్దుగుమ్మ సమీరారెడ్డి. తెలుగు, తమిళం, బెంగాలీ, హిందీ ఇలా ఏ బాష అయినా ఆమెకు పరవాలేదు కానీ ఈ మధ్య బెంగాలీ బాష అంటే సమీరా ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తోంది.

'కాల్ పురుష్' అనే బెంగాలీ సినిమాలో నటించిన సమీరా ఆ బాషపై ప్రత్యేక మమకారాన్ని కనపరచడమే కాదు, మరో బెంగాలీ సినిమాలో నటించాలని ఉవ్విళ్లూరుతోంది. బెంగాలీపై ఇంత ప్రేమను సమీరా ఎందుకు కనపరుస్తుందా అని మనవారు ఆరా తీస్తే ఆసక్తి కరమైన అంశమే బయటపడింది. అదేమిటంటే.. సమీరా రెడ్డి ప్రేమలో పడింది బెంగాలీ కుర్రాడంట. ఇద్దరు మనస్సులు కలవడంతో.. సమీరా బెంగాలీపై అమిత ప్రేమ కనపరుస్తోంది.
About Writer
WD