దుస్తులు ఓకే... ముద్దు మాత్రం వద్దు
మంగళవారం, 17 జులై 2007( 14:45 IST )
సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రియురాలిగా బాలీవుడ్ నోట్లో నానుతున్న నిషా కొఠారికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రముఖ నిర్మాత ఆదిత్య దత్ నిర్మిస్తున్న ఓ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించేందుకు ససేమిరా అంది. దీంతో నిర్మాతకు దిక్కుతోచక మరుసటి రోజు సినిమా షూటింగ్‌కు రావద్దని ఫోన్‌చేసి చెప్పేశాడట. అయితే ముద్దుకు మాత్రం అంగీకరించని నిషా.. ఎలాంటి దుస్తులనైనా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
తన గురువు రామ్‌గోపాల్ వర్మ ఏమన్నా అనుకుంటాడేమోననా ముద్దు వద్దందట. అయితే ప్రస్తుతం నిషా చేతిలో ఒకే సినిమా ఉంది. అదీ కూడా రామ్‌గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'షోలే' చిత్రం. ప్రస్తుతం ఆ సినిమా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కుంటోంది. ఏదేమైనా బట్టల విషయంలో లేని ఇబ్బంది ముద్దుల విషయంలో ఎందుకా అని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.