1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

టాలీవుడ్‌లో భారీ పారితోషకం పొందే హీరోయిన్లు

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు. ఎవరైతే అపరిమితంగా.. తమ అందచందాలను
WD PhotoWD
టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు. ఎవరైతే అపరిమితంగా.. తమ అందచందాలను ఆరబోస్తున్నారో.. వారికే ఎక్కువ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదే అదునుగా చేసుకున్న కొందరు హీరోయిన్లు ఆందాలను ఆరబోయటానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అలాగే పారితోషకాన్ని డిమాండ్ చేయడంలోను తగ్గడం లేదు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలియానా, అనుష్క, శ్రియ, నయనతార, త్రిష, ఆసిన్, జెనీలియాలు తారాపథంలో ఉన్నారు. వీరిలో ఎక్కువగా పారితోషకాన్ని పొందుతున్న హీరోయిన్లలో ఇలియాన అగ్రస్థానంలో ఉంది. ఇలియానాకు 60 లక్షల రూపాయల మేరకు వసూలు చేస్తోందట.

ఆమె తర్వాత స్థానంలో శ్రియ రూ.50 లక్షలు, నయనతార రూ.45 లక్షలు, త్రిష రూ.40 లక్షలు, ఆసిన్ రూ.40 లక్షలు, జెనీలియా రూ.35 లక్షలు, స్నేహ రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్టు వినికిడి. పారిశ్రామికవేత్తను వివాహమాడి ఓ బిడ్డకు తల్లైన సిమ్రాన్.. మళ్రీ రెండో ఇన్నింగ్స్ ఆరభించిన విషయం తెల్సిందే.

తల్లిగా మారినప్పటికీ.. తన అందచందాలు ఏమాత్రం తగ్గలేదని వాదిస్తూ.. పది లక్షల పారితోషకాన్ని డిమాండ్ చేస్తోందట. ఏది ఏమైనా.. మన నిర్మాతలకు కావాల్సింది.. హీరోయిన్ల అందచందాలే కదా...!
About Writer
PNR