1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల సినిమా ''సత్యాగ్రహి''

ప్రముఖ కథా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ప్రముఖ కథా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రానికి 'సత్యాగ్రహి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఆ చిత్రం యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో మంచి హిట్ ‌కోసం పరితపిస్తున్న ఈ పవర్ స్టార్ 'సత్యాగ్రహి' చిత్రంతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

లోగడ 'ఖుషి' లాంటి ఘన విజయాన్ని ఈ సినిమా ద్వారా తిరిగి పొందాలని పవన్ భావిస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ తదుపరి సినిమా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందనున్న "పులి" చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ సంగీత బాణీలను సమకూర్చనున్నారు.

ఇందుకోసం ఆయన రూ.రెండు కోట్లు తీసుకున్నట్టు సమాచారం. తొలుత "పులి" సినిమాను తమిళ నటుడు విజయ్‌తో తీద్దామనుకున్నప్పటికీ సూర్య, విజయ్‌ల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాలు వల్ల ఆ అవకాశం పవన్‌కు వచ్చింది.
About Writer
WD