1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఎడాపెడా సంపాదనలో కథానాయికలు

ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లకు సరైన అవకాశాలు లభించడం లేదు. ఇందుకు కారణాలు అనేకం
ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లకు సరైన అవకాశాలు లభించడం లేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. పరభాషల తారామణులతో పాటు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు చిత్రసీమకు దిగుమతి కావడం ఒకటి. దీంతో.. అంతోఇంతో పేరున్న హీరోయిన్లకు వరుస అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఈ కారణంగా తమ పాపులారిటీని నిలబెట్టుకునేందుకు, అభిమానుల కళ్ళకు కనిపించేందుకు, ఎల్లపుడూ వార్తల్లో ప్రధానంగా నిలిచేందుకు వివిధ రకాల యాడ్స్‌లలో నటిస్తున్నారు.

దీన్ని బంగారు షాపులు, వస్త్ర దుకాణాల యజమానులు కూడా తమ షోరూమ్‌ పాపులారిటీకి ఉపయోగించుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన హీరోయిన్లు పలువురు యాడ్‌లలో నటించడమే కాకుండా.. అడపాదడపా వచ్చే సినీ అవకాశాల్లో నటిస్తూ.. రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ నటి స్నేహ ముందజలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల భొగట్టా.

అటు తమిళంలో అవకాశాలు కరువైన స్నేహా.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమనే నమ్ముకుంది. ఇక్కడ కూడా అవకాశాలు అంతంతమాత్రంగా వస్తుండటంతో యాడ్స్‌లలో ఎక్కువగా నటిస్తోంది ఒక్కో ప్రకటనకు లక్షలాది రూపాయలు చొప్పున వసూలు చేసే.. స్నేహ అతి చిన్న యాడ్‌కు కనీసం యాభైవేలు ఇవ్వాలని, లేదంటే కుదరదని ఖరాఖండిగా చెపుతోందట.
About Writer
PNR