1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

పరిశ్రమకు చెందిన వారే బాధలు అర్థం చేసుకుంటారు: శ్రియ

జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి చిత్ర పరిశ్రమకు చెందిన వారైతేనే మన సాధక బాధలను అర్థం చేసుకోగలరని 'శివాజీ' ఫేం.. శ్రియ
WD PhotoWD
జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి చిత్ర పరిశ్రమకు చెందిన వారైతేనే మన సాధక బాధలను అర్థం చేసుకోగలరని 'శివాజీ' ఫేం.. శ్రియ అభిప్రాయపడుతోంది. ఇంతకీ ఆమె ఇలా మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు.. ఢిల్లీకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో శ్రియకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు ఆ మధ్య పుకార్లు వచ్చాయి. వీటిని శ్రియ కూడా ఖండిచలేదు. అయితే..'శివాజీ' చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడంతో శ్రియ బిజీగా మారిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో.. 'శివాజి' షూటింగ్‌లో శ్రియ బిజీగా ఉన్న సమయంలో పారిశ్రామికవేత్త షూటింగ్ స్పాట్‌కు రాగా, ఆయన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదని, అందువల్ల ఆయన కోపంతో అలిగి ఢిల్లీకి వెళ్లినట్టు కోడంబాక్క వర్గాలు వినికిడి. ఆ తర్వాత ఆయన వ్యాపారంలోను, శ్రియ నటనలో మునిగిపోవడంతో వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందట.

ఇదే విషయమై శ్రియా మాట్లాడుతూ... ఇది కొద్ది రోజులు సాగిన వ్యవహారం మా భిన్న వృత్తులు మమ్మల్ని కలుసుకోకుండా చేస్తున్నాయి. సహజంగానే మేము దూరం అయ్యాం. ఇలాంటి స్థితిలో సంబంధాన్ని కొనసాగించడం కష్టమేననంటోంది. ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోనే ఒకరిని చూసుకుంటేనే ఈ వృత్తిలో ఉండే సాధక బాదకాలు తెలుస్తాయని శ్రియ వేదాంత ధోరణిలో మాట్లాడుతోంది.
About Writer
PNR