1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

''అతిథి''లో ఐటంసాంగ్‌లో నర్తించనున్న ఇలియానా..!!

తెలుగు చిత్ర సీమలో 'పోకిరి' చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రం జంట మరో మారు వెండితెరపై
WD PhotoWD
తెలుగు చిత్ర సీమలో 'పోకిరి' చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రం జంట మరో మారు వెండితెరపై తమ అందాలను ఆరబోయనున్నట్టు వినికిడి. ఇప్పటికే.. ఈ జంట తెలుగు చిత్ర సీమలో బాగా పాపులర్ అయింది. ఇలాంటి జంటతో చిత్రాలు తీసేంగుకు నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు.

అయితే.. మహేష్ బాబు హీరోగా ఆయన సోదరుడు రమేష్ బాబు నిర్మిస్తున్న 'అతిథి' చిత్రంలో ఇలియానా నటిస్తున్నట్టు వినికిడి. అయితే హీరోయిన్‌గా మాత్రం కాదు. ఐటంసాంగ్‌లో మహేష్‌తో నర్తించేందుకు ఇలియానా అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. తెలుగులో మంచి డిమాండ్ ఉన్న ఇలియానా ఐటం‌సాంగ్‌ చేసేందుకు అంగీకరిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి