1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కొత్త నిర్ణయం తీసుకున్న మలయాళ ముద్దుగుమ్మ..!

తమిళ యువనటుడు శింబు పేరు వినగానే భయపడి తమిళ చిత్రసీమను వదిలి తెలుగుకు పరుగులు తీసిన మలయాళ ముద్దుగుమ్మ నయనతార
WD PhotoWD
తమిళ యువనటుడు శింబు పేరు వినగానే భయపడి తమిళ చిత్రసీమను వదిలి తెలుగుకు పరుగులు తీసిన మలయాళ ముద్దుగుమ్మ నయనతార. ఈమెకు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. మొన్న ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఫంక్షన్‌లో అప్ సెట్‌, తర్వాత బార్‌లో తప్పతాగి స్పృహ లేకుండా పడిపోవడం వంటి సంఘటనలు నయన మనసును కలసి వేశాయట. ముఖ్యంగా తమిళ నటుడు శింబుతో నడిపిన ప్రేమాయణం గుర్తుకు వచ్చినపుడల్లా తెగ బాధపడిపోవడం నయనతార మనస్సు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయట.

ఈ నేపథ్యంలో వీటికి దూరంగా ఉండేందుకు ఓ కొత్త నిర్ణయం తీసుకుందని కోడంబాక్కం వర్గాల భోగట్టా. తన మాజీ ప్రియుడు పాల్గొనే కార్యక్రమాల తాను హాజరుకావడం, ఆయన నటించే సినిమాల్లో అవకాశాలు వస్తే.. నటించేందుకు అంగీకరిస్తానని అందరికీ చెబుతూ... తానే స్వయంగా ప్రచారం చేస్తోందట. శింబు అంటేనే భయపడి తెలుగు పరిశ్రమకు మారిన నయనతార తాజా నిర్ణయానికి కారణం మాత్రం తెలియడం లేదు.

శింబుకు దూరంగా ఉండి ఆయనను ఎదుర్కోవడం కంటే దగ్గర ఉంటూ.. ఎదుర్కోవడమే మేలనుకున్నట్టా? లేక శింబు వ్యవహారం లోకానికి తెలియడం మూలానా ఎవరూ పెద్దగా పట్టించుకోక పోవడంతో ఆయనతోనే సర్దుకుపోదామనుకుంటుందా? అనే విషయాలను నయనతారను అడిగి తెలుసుకోవాల్సిందే.
About Writer
PNR