1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మీడియా అంటే పడని ''అతిథి'' హీరోయిన్‌

'అతిథి' చిత్రంలో హీరో మహేష్ బాబు సరసన అమృతారావు హీరోయిన్‌గా నటిస్తున్న విషయం
WD PhotoWD
'అతిథి' చిత్రంలో హీరో మహేష్ బాబు సరసన అమృతారావు హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే... ఈ ముద్దుగుమ్మకు ఇటీవలి కాలంలో కోపం ఎక్కువైంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 'అతిథి' చిత్రం కోసం రోడ్డుపై ఓ పాటను ఇటీవల చిత్రీకరించారు. దీన్ని చూసేందుకు మన జనాలు వింతగా చూడటం సహజం. అంతటితో ఊరుకోని కొందరు అకతాయిగాళ్లు.. అమృతా అందాలను తమ సెల్‌పోన్లలో బంధించి స్నేహితులకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపారట. ఇవి అమ్ము కంటిలో పడటంతో అగ్గిమీద గుగ్గిలంలా మారింది.

ఈ నేపథ్యంలో ఈ మధ్య షూటింగ్ జరుగుతుండగా మీడియా ఫోటోగ్రాఫర్లు యధాప్రకారం షూటింగ్ స్పాట్‌కు వెళ్లారట. సాధారణంగా మీడియా షూటింగ్‌ స్పాట్‌కు వెళితే చిత్ర పరిశ్రమకు కొత్తగా హీరోయిన్స్ ఎంతో సంతోషిస్తారు. అయితే మన మీడియా వారు వెళ్లగానే అమ్ముకు మాత్రం చిర్రెత్తుకుందట.

వెంటనే నిర్మాతను పిలిచి.. మీడియా ఇక్కడ ఉంటే షూటింగ్‌‌ చేయడానికి వీల్లేదని పట్టుపట్టిందట. దీంతో నిర్మాత ఏం చేయలేక.. ఆమె చెప్పినట్టే చేశారట. అయితే.. మీడియా మాత్రం.. కొత్త హీరోయిన్‌కు ఇంత పనికిరాదని వాపోతున్నారు.
About Writer
PNR