ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ''బొమ్మరిల్లు'' భామ
Updated: Tue, 11 Sep 2007 (13:47 IST)
బొమ్మరిల్లు చిత్రంలో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును కొట్టేసిన భామ జెనీలియా. ప్రస్తుతం దక్షిణాదిలో చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అయినప్పటికీ.. అమీర్ ఖాన్ హీరోగా తుషార్ కపూర్ నిర్మించే హిందీ చిత్రంలో అరుదైన అవకాశం జెలీనియాకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో మోతాదుకు మించి తన అందచందాల్ని ఆరబోయాల్సి ఉంటుందని తెలుసుకున్న ఈ భామ ఆ చిత్రంలో నటించేందుకు నిరాకరించినట్టు ఫిల్మ్ నగర్ వాసులు పేర్కొంటున్నారు. హిందీ చిత్రం స్క్రిప్ట్ ఆమెకు బాగా నచ్చినప్పటికీ.. అందులో ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేయాల్సి ఉందని నిర్మాతలు చెప్పారట. ఆమెరకు స్క్రిప్ట్‌ను మొదటనే రూపొందించారట. అయితే.. దర్శకనిర్మాతలు చెప్పినట్టు కాకపోయినా.. కొంతమేరకు ఎక్స్‌పోజింగ్ చేయడానికి సిద్ధమేకానీ అంతలా చేయమంటే నా వల్లకాదని జెనీలియా తెగేసి చెప్పి, ఆ అవకాశాన్ని తిరస్కరించిందట. మరి అమీర్‌ఖాన్‌తో నటించే అవకాశాన్ని ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
మరింత చదవండి